ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

ముద్రగడ మళ్లీ మొదలెట్టాడుగా..బాబుకు రెండు ఛాయిస్ లు

గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి అతిపెద్ద తలనొప్పిగా మారిన కాపు రిజర్వేషన్స్ విషయం నెలకొక మలుపు తిరుగుతోంది. కాపు రీసర్వేషన్స్ కోసం పోరాడుతుతున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్సలు సైలెంట్ గా ఉండడం లేదు. ఇంతకుముందు కిర్లంపూడిలో పాదయాత్రను నిర్వహించాలనుకున్న ముద్రగడని ప్రభుత్వం శాంతి భద్రతల నేపథ్యంలో బాగానే అడ్డుకుంది. అయితే ఆయన మళ్లీ అదే స్థాయిలో కాపు ఉద్యమాన్ని లేపేందుకు ఆలోచనలో ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా ఈ సమస్య పెద్ద సవాలుగా మారింది. పాదయాత్ర అడ్డుకున్న తర్వాత అంత సైలెట్ అయ్యిందిలే అనుకుంటున్నా తరుణంలో ముద్రగడ మరో బాంబు పేల్చాడు.
అంబేడ్కర్ వర్ధంతి అనగా డిసెంబర్‌ 6 నాటికి కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలని ముద్రగడ చంద్రబాబుకు లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు. అప్పట్లో బ్రిటిష్ పాలన కొనసాగినప్పుడు లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లు అలానే కొనసాగించాలని అంబేడ్కర్‌ చెప్పారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆయన మీడియా ద్వారా మరొక ముఖ్య విషయాన్ని కూడా ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 6 లోగా సీఎం ఎదో ఒక నిర్ణయాన్ని తెలుపాలని దాన్ని బట్టి తమ దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్ లో ఎదో ఒక దాన్ని నిర్ణయించుకుంటామని ముద్రగడ తెలిపారు.

Comments