ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

కేసీఆర్ మెడ‌కు ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ గుదిబండ‌

kcr1
నిరుపేద‌లు, బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన‌ది-ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్. ప్ర‌యివేటు కాలేజీల ఫీజు దందాల‌కు పేదలైన ప్ర‌తిభావంతులు బ‌లైపోకూడ‌ద‌నే ఉద్ధేశంతో ఏర్పాటు చేసిన‌ద‌న‌డంలో సందేహ‌మే లేదు. నాటి వైయ‌స్సార్ ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా ఎన్నిక‌ల ముందు ఈ విధానాన్ని తెర‌పైకి తెచ్చిన బాధితులైన విద్యార్థుల‌కు ఎంతో మేలు చేసింద‌న‌డంలో సందేహ‌మే లేదు. అయితే ప్ర‌స్తుతం ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ విభ‌జిత తెలంగాణ‌కు పెనుభార‌మైంద‌న్న‌ది కేసీఆర్ ప్ర‌భుత్వ వాద‌న‌. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఆదాయం ప‌డిపోవడంతో బెంబేలెత్తుతున్న కేసీఆర్ ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ ఎలా చెల్లించాలా? అన్న డైలెమ్మాలో ఉన్నారు. అయితే సంద‌ట్లో స‌డేమియాలాగా.. ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్‌పై ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని చేప‌డుతున్నాయి.

టీటీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఓవైపు, కాంగ్రెస్ వ‌ర్గాలు మ‌రోవైపు రీఇంబ‌ర్స్‌మెంట్‌పై గొంతెత్తాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం చెల్లిస్తుందా? చ‌స్తుందా? అన్న తీరుగానే వీళ్లంతా ప్ర‌శ్నిస్తున్నారు. నిన్న‌టిరోజున తెలంగాణ అసెంబ్లీలో జ‌రిగిన ర‌చ్చ‌లో కేసీఆర్ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిలోకి వెళ్లిపోయారు. ప్ర‌యివేటు కాలేజీల‌ను దునుమాడే ప‌ని పెట్టుకున్నారు. అయితే చివ‌రికి ఏదోలా .. ఈర్ ఎండ్‌లో మార్చి మాసాంతం నాటికి ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ మొత్తం చెల్లిస్తామ‌ని కేసీఆర్ మాటివ్వాల్సొచ్చింది. మొత్తం 1500 కోట్ల వ‌ర‌కూ పోగ‌యిన ఈ బ‌కాయిని ఇప్పుడు చెల్లించాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డింది. లేదంటే ప్ర‌యివేటు కాలేజీ యాజ‌మాన్యాలు విద్యార్థుల జీవితాల‌తో ఆడుకునేందుకు ఏమాత్రం వెన‌కాడ‌వ‌న్న సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2019 ఎన్నిక‌ల వేళ తేరాస ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డంలో విప‌క్షాలు గెలిచిన‌ట్టే భావించాలి.

Comments