ప్రచురణ తేదీ : Mon, Sep 11th, 2017

రైనా, యూవీ కెరీర్ క్లోజ్ .. కోహ్లీ పక్షపాతం వల్లే ఇలా..?


సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లు తక్కువ కాలం లోనే టీం ఇండియా లో మంచి ఫినిషర్ లుగా పేరుగాంచారు. ముఖ్యంగా యూవీ అయితే మిడిల్ ఆర్డర్ లో తన బ్యాటింగ్ నైపుణ్యం తో భారత జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాలను అందించాడు. కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు గత కొంత కాలంగా ఫామ్ లేమితో సమతమత మవుతున్నారు. త్వరలో టీం ఇండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో తొలి మూడు వన్డేలకు సెలెక్టర్ లు జట్టుని ప్రకటించారు. ఆ టీమ్ లో రైనా, యూవీలకు చోటు దక్కక పోవడం గమర్హం.

రైనా, యువరాజ్ లు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మాట వాస్తవమే. కానీ వారికి ఇవ్వాల్సినన్ని ఛాన్సులు ఇవ్వడం లేదనే వాదన కూడా ఉంది. ఇక అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి మరి కోహ్లీని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ లోని సభ్యులనే ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని, ఇదంతా కోహ్లీ వలనే జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేదార్ జాదవ్ కంటే రైనా, యువీ లు మంచి ఫినిషర్లు అని చెప్పే వారూ లేకపోలేదు. మనీష్ పాండే ఎంపికపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా యూవీ, రైనా ల కెరీర్ ప్రమాదంలో పడినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

Comments