ప్రచురణ తేదీ : Jan 23, 2018 2:13 PM IST

వీడియో : రక్తంతో పవన్ వద్దకు వచ్చిన అభిమాని

జనసేన అధినేత పవన కళ్యాణ్ తెలంగాణాలో రెండవ రోజు తన ప్రజాయాత్రను కొనసాగిస్తున్నాడు. నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల్లోని కార్యకర్తలతో పవన్ కరీంనగర్ శుభం గార్డెన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయితే పవన్ మాట్లాడుతుండగా ఒక వ్యక్తి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని అద్దాలు పగిలి అతనికి గుచ్చుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గాయపడిన వ్యక్తిని పవన్ ఆసుపత్రికి తరలించమని సన్నిహితులకు తెలియజేశాడు. అయితే పవన్ తనం కోసం వచ్చిన అభిమానులకు ఇలాంటి ప్రమాదాలు ఎదురైతే తాను తట్టుకోలేనని వివరించాడు. అంతే కాకుండా పవన్ జై తెలంగాణ అని నినాదాలు చేయడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments