మోడీ ప్రభుత్వం మంచి పని చేస్తోంది ..


సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నరేంద్ర మోడీ కి సూపర్ ప్రశంస లభించింది ఆ ప్రశంస ఇచ్చింది కూడా ఎవరో కాదు ఫేస్ బుక్ అధ్యక్షుడు మార్క్ జుకర్ బెర్గ్. ప్రజలు ప్రతినిధుల మధ్యన జవాబీ తనాన్ని మోడీ బాగా పెంచుతున్నారు అంటున్నాడు అతను. ‘బిల్డింగ్‌ గ్లోబల్‌ కమ్యూనిటీ’ పేరుతో 200 కోట్ల మంది తమ సైట్ వినియోగ‌దారుల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న రాసిన పోస్టులో మోదీ ప్ర‌స్తావ‌న తెచ్చారు.

ఎన్నికల్లో గెలిచాక చేతులు దులుపుకోవటం కాదని, ఐదేళ్లపాటు వారితో నేరుగా అనుసంధానమై ఉండాలని పేర్కొన్న జుక‌ర్ బ‌ర్గ్ ఈ విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం ముందుంద‌ని చెప్పారు. మోదీ త‌మ‌ సమావేశాల వివరాలు, ఇతర సమాచారం ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు చేరాలని మంత్రుల‌ను కోరారని ఆయ‌న పేర్కొన్నారు.

Comments