జనసేనలోకి మాజీ స్పీకర్ !

జనసేన అధినేత ఇటీవల ఉత్తరాంధ్ర లో చేపట్టిన ప్రజా పోరాట యాత్రకు అనుహ్య స్పందన లభించింది. ఏడు సిద్ధాంతాలతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ప్రజలను బాగా ఆకర్షించడంతో అక్కడి నేతల చూపు ఈ పార్టీ ఫై పడింది. దాంతో జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభ భారతి జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

1983 నుంచి 1999 వరకు జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రతిభా భారతి ఘనవిజయం సాధించారు. ఆమెకున్న ప్రజాదరణ కారణంగా దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పని చేశే అవకాశం లభించింది. ఆతరువాత ఆంధ్రప్రదేశ్ తొలి దళిత స్పీకర్ గా పనిచేసిన ఆమె 2004,2009,2014 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇక గత ఎన్నికల్లోఆమె ఫై విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ఇటీవల తెలుగుదేశంలో చేరారు.

Comments