కాంగ్రెస్ ను ప్రజలు శిక్షించినా గుణపాఠం నేర్చుకోలేదు!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి మంచి కసిగా రగులుతోంది. ఓవైపు ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయమై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని టీపీడీ సహా అక్కడి పార్టీలు బీజేపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఇటీవల మోడీ పై ఆయన ప్రజా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అయన మాట్లాడుతూ మోడీ అన్ని శాఖల్లో తన పాలనలో ఫెయిల్ అయ్యారని, ఇప్పటికే ఆయన పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, పెద్ద నోట్ల రద్దు మరియు జీఎస్టీ వంటి అర్ధం లేని విధానాలు ప్రవేశ పెట్టడం వలన దేశ ఆర్ధిక ప్రగతి మరింత కుంటుపడి సామాన్యుడు తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కోవలసి వస్తోందనిమండిపడ్డారు.

రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతి అక్రమాలను అయన ప్రభుత్వం ఇప్పటికైనా బయటపెడితే కొంతైనా ప్రజల నుండి సానుభూతి దక్కుతుందని ఎద్దేవా చేసారు. ఇక ఈ విషయమై నేడు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన బీజేపీ నేత మరియు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాహుల్ చేసేవన్నీ కూడా అసత్య ఆరోపణలు అనే విషయం అందరికి తెలుసునన్నారు. మోడీ పాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా వున్నారో ఆయనకు కూడా తెలుసునని, గత ఎన్నికల సమయంలో ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీ ధోరణి మారలేదని మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందం గురించి రాహుల్ ప్రస్తావించడం నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఏ విధంగా మా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసి ప్రజల్లో మాకు చెడ్డ పేరు తేవాలి అనేలా కాంగ్రెస్ చూస్తుందేతప్ప ప్రజలు సుఖపడడం వారికి అవసరం లేదని అన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు తమకే పట్టం కట్టి తీరుతారని, మరొక్కమారు మోడీ ప్రధానై అవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు…

Comments