రామోజీ రావుకు ఏమైంది..?

ramoji
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తాయని ప్రస్తుతం సోమాజిగూడ యశోదా హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. సోమవారం రోజే ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు మరియు వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక సమాచారం వెలువరించలేదు.

ప్రస్తుతం నిపుణులైన వైద్యులు రామోజీ రావుకు చికిత్సని అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండనే సమాచారాన్ని తెలియజేసినట్లు చెబుతున్నారు. కానీ ఆయన ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారన్న విషయం పై క్లారిటీ లేదు. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియాసంస్థలు రామోజీ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Comments