ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

దేశంలోనే తొలిసారి నంద్యాలలో..ఇక ఆ ఛాన్స్ ఉందేమో..!


రిగ్గింగ్ ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం నంద్యాల ఉపఎన్నికలో కొత్త ఓటింగ్ విధానాన్ని అమలు చేయనుంది. సాధారణంగా ఉండే ఈవీఎం లలో ఓటు వేస్తె రిగ్గింగ్, ఏవిఎం టాంపరింగ్ , క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటూ వాదనలు వినిపించాయి. వాటిని అరికట్టడానినికి ఎన్నికల సంఘం వివిపిఏటి (ఓటర్ వెరిఫైడ్ అడిట్ ట్రయల్) పద్దతిలో ఎన్నిక నిర్వహించనుంది. దీనివలన ఓటరు ఓటు వేసిన తరువాత తాను ఎవరికి ఓటు వేసానో మరో యంత్రంలో చూడొచ్చు.

ఒకవేళ ఓటరు పొరపాటున తాను ముందుగా అనుకున్న అభ్యర్థి ఓటు వేయకపోయి ఉంటె ఆవిషయాన్ని అక్కడ ఉన్న అధికారులకు తెలియజేయవచ్చు. వెరిఫికేషన్ యంత్రం లో ఓటరు నమోడీ చేసిన ఓటు వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ తాను తప్పుగా ఓటు వేసి ఉంటె రిటర్నింగ్ అధికారిద్వారా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వలన క్రాస్ ఓటింగ్ తగ్గుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనిపై ఇదివరకటికే ఎన్నికల సంఘం అవగాహనా కార్యక్రమాలను నిర్వహించింది.

Comments