శశికళ ను విమర్శించొద్దు అంటున్న జయ మేనకోడలు

deepa
జయలలిత మరణం తరువాత అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది జయ మేనకోడలు దీప. జయలలిత బ్రతికి ఉన్నపుడు దీప గురించి ఎవరికీ తెలీదు. జయలలిత మరణం తరువాతే ఆమె గురించి అందరికీ తెలిసింది. జయలలిత మరణించినపుడు తనంతట తానే ఆమెకు వారసురాలిగా ప్రకటించుకుంది. శశికళను ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టింది. ఆమె ఈ పదవిని చేపట్టడం ఇష్టం లేని కొంతమంది అన్నాడీఎంకే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆమెకు వ్యతిరేకంగా దీప రాజకీయాలలోకి రావాలని కోరుతున్నారు.

దీపకు మద్దతుగా కొన్ని సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అన్నాడీఎంకే పార్టీలోని అసంతృప్తి నేతలు దీపను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. శశికళ, ఆమె భర్త నటరాజన్, ఆమె బంధువులు అందరూ ఉన్న తంజావూరు జిల్లాలో దీపకు మద్దతు పెరగడం విశేషం. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ… శశికళ ప్రజల ఆమోదం పొందలేదని కనుక ఆమెను విమర్శించవద్దని, తనకు మద్దతు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దీప సూచన మేరకు శశికళ విషయం పక్కన పెట్టి అన్నాడీఎంకే పార్టీ మొత్తం దీపకు మద్దతుగా ఉందని నిరూపించాలని దీప మద్దతుదారులు అనుకుంటున్నారు.

Comments