భారతీయులకి ట్రంప్ షాక్… 7 వేల మంది వెనక్కి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షా పీఠం మీద కూర్చున్నప్పటి నుంచి భారతదేశానికి తెలియని ఓ కష్టం దాపురించింది. అమెరికాని విదేశీయులు వచ్చి దోచుకుంటున్నారని, తాను అధ్యక్షుడు అయ్యాకా వర్క్ పర్మిట్స్ అన్ని రద్దు చేస్తా అని ప్రకటించిన ట్రంప్, ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించి ఇప్పుడు దానికి సంబంధించి ఫైల్ మీద సంతకం చేసాడు. వర్క్ పర్మిట్ వీసాతో దేశంలో ఉండే వారికి ఇది కోలుకోలేని దెబ్బ. వాళ్ళందరు వీలైనంత వేగంగా దేశం విడిచి వెళ్ళాలి. లేదంటే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం వ్యాప్తంగా 8 లక్షల మంది డ్రిమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు అయ్యాయి. అమెరికా విడిచి వెళ్ళాల్సింది. ఇక ఈ ఎఫెక్ట్ భారతీయులకి కూడా భారీగానే తగిలింది. భారతదేశానికి చెందిన 7 వేల మది భారతీయ అమెరికన్స్ అక్కడ డ్రీమర్స్ వర్కింగ్ పర్మిట్ వీసా మీద ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారు దేశం విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాల వలన దేశీయ ఐటీ రంగ భవిష్యత్తు అగమ్యగోచరంగా వుంది. ఇప్పుడు ఈ వర్కింగ్ పర్మిట్ వీసాలు రద్దు చేయడం మరింతగా భారతీయులకి తలనొప్పి తెప్పించే వ్యవహారం అని చాలా మంది భావిస్తున్నారు.

Comments