ప్రచురణ తేదీ : May 18, 2018 11:38 PM IST

రియల్ ఒక్కరోజు ‘ఒకేఒక్కడు’ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఒకప్పుడు విడుదలయి పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అచ్చం అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఒక రోజు ముఖ్యమంత్రిగా పని చేసిన నేత వున్నారు. విషయంలోకి వెళితే, యూపీలో 1998లో అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో అప్పటి బీజెపి నేత కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో, ఇతర పార్టీలతో కలిసి వారు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కోరగా, గవర్నర్ వారిని తిరస్కరించి కాంగ్రెస్ ను అహ్వాయించారు. దానితో పెద్ద ఘర్షణ చెలగెడం ఆ తరువాత ఇరుపార్టీలవారిని అభ్యర్థులతో సహా బాల పరీక్ష నిర్వహించగా చివరికి కళ్యాణ్ సింగ్ గెలిచారు.

అయితే ఆ సమయంలో అసెంబ్లీ లో హింసాత్మక ఘటనలు జరిగాయి. వెంటనే గవర్నర్ అప్పటి రాష్ట్రపతిని యుపిలో రాష్ట్రపతి పాలనా విధించవలసిందని కేంద్రాన్ని కోరగా అయన అందుకు నిరాకరించింది. ఆ తరువాత కళ్యాణ్ సింగ్ తమ 93 మంది అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, తమకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల నేతలకు కూడా మంత్రి పదవులిచ్చారు. దీనికి అభ్యన్తరం తెలిపిన గవర్నర్ రాత్రికి రాత్రే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జరీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ కు చెందిన జగదాంబిక పాల్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన్ను ఎన్నుకుని ఒక్కరోజు కూడా కాకముందే

వెనువెంటనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు తలెత్తడంతో మళ్లి గవర్నర్ బలపరీక్ష నిర్వహించగా ఈ సారి కూడా కళ్యాణ్ సింగ్ నెగ్గడంతో ఆ విధంగా జగదాంబిక పాల్ కేవలం ఒకరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా నిలిచారు. కాగా ప్రస్తుతం కర్ణాటకలో కూడా దాదాపు అటువంటి సీన్ రిపీట్ అయ్యల వుంది. రేపు సాయంత్రం 4 గంటలవరకు యడ్యూరప్పకు బలపరీక్షకు సమయం ఉండడంతో, ఆయనకనుక నిర్ణీత సమయంలోగా తమ అభ్యర్థుల బలాన్ని నిరూపించుకోకపోతే మూడురోజుల ముఖ్యమంత్రిగా కర్ణాటక చరిత్రలో నిలిచే అవకాశం వుంది…..

Comments