ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

వీడియో: స్టేషన్ ముందే పోలీసును కొట్టిన న్యాయమూర్తి..ఎందుకంటే ?

నలుగురికి న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు డ్యూటీలో ఉన్న పొలిసు అధికారులపై చేయి చేసుకున్నారు. పోలిస్ స్టేషన్ ముందు ఆమె ప్రవర్తించిన తీరు అందరిని షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని డేహ్రాడూన్ లోని ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అందరిని అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత ఆ విద్యార్థుల తల్లి దండ్రులను కూడా పిలిపించారు. అయితే ఆ గొడవలో ఉన్న ఒక విద్యార్థి తల్లి జిల్లా అడిషనల్ న్యాయమూర్తినని అంటూ రెచ్చిపోయారు. నా కొడుకును తీసుకువస్తారా అంటూ పోలీసులపై అరిచింది. అయితే ఆమె మాటలని వీడియో తీసేందుకు ప్రవర్తించిన ఒక పొలిసు అధికారిని ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఈ ఘటనని మరొక కానిస్టేబుల్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పోలీసులు ఆమెపై న్యాయపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments