చంద్రబాబుకు ‘లాలీపాప్’ గిఫ్ట్..!

digvijay_singh1
పోలవరాన్ని మీరే నిర్మించుకోండి అని చంద్రబాబుకు నరేంద్రమోడీ పెద్ద లాలీపాప్ ను గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు దిగ్విజయ్ సింగ్.ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కాబట్టి పోలవరం కూడా మీరే నిర్మించుకోండని అన్నట్లు మోడీ వ్యవహారం ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. పోలవరం ముంపునకు గురయ్యోవి గిరిజన గ్రామాలే కావున ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు గ్రామాలకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అన్నారు.

ఇటు తెలంగాణలో మల్లన సాగర్ కోసం రెవెన్యూ అధికారులు పోలీస్ ల సహకారంతో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్నవి జమిందారీ రోజులు కావని ప్రజాస్వామ్య రోజులన్న విషయం కేసీఆర్ గ్రహించాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ ఆ డబ్బుతో ఇతర పార్టీల ఎమ్మెల్యే లను కొంటున్నారని ఆరోపించారు.

Comments