ప్రచురణ తేదీ : Jan 12, 2018 4:15 PM IST

వీడియో : కూతురి స్కూల్ వేడుకలో ధోని సందడి

భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఎంత మంచి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ధోని వ్యక్తిగత జీవితంలోను మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి భర్తగా తండ్రిగా కూడా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చాలా రోజుల తరువాత కొంచెం విరామం దొరకడంతో ధోనికి కూతురు జివాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వివిధ ప్రదేశాలను కూడా తీరిగివచ్చాడు. అంతే కాకుండా రీసెంట్ గా తన పాప మొదటి స్కూల్ అన్వల్ డే ఫంక్షన్ కి కూడా ధోని వెళ్లాడు. వేడుకలో జివా అందరిని ఆకట్టుకునే విధంగా డ్యాన్సులను చేసింది. అది చూసిన ధోని ఎంతగానో మురిసిపోయాడు. ఇక వేడుక అనంతరం. తన తండ్రికి జివ తోటి విద్యార్థులను పరిచయం చేసింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక ధోని మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే సౌత్ ఆఫ్రికా వన్డే – టీ20 సిరీస్ లకు వెళ్లనున్నాడు.

Comments