ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ధోని కెప్టెన్సీ ని వదిలేశాడు..కానీ యువీని పట్టేశాడు..!

dhoni-yuvaraj
మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ లో వీళ్లిద్దరూ సంచలనమే. కెప్టెన్ గా ధోని భారత్ ని తిరుగులేని స్థానం లో నిలబెట్టగా, ఆటగాడిగా యువీ అనేక చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ వీరిమధ్య అప్పట్లో విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యువీ జట్టులో స్థానం కోల్పోవడానికి కారణం ధోని అంటూ ప్రచారం జరిగింది. యువరాజ్ తండ్రి అయితే ధోనిని బహిరంగంగానే విమర్శించాడు.కాగా ఇటీవల ధోని కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని, యువరాజ్ లు తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారు. వీరి మధ్య జరిగిన సంభాషణని యువరాజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం ఇంగ్లాండ్ తో భారత్ ఏ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం యువీ సరదాగా ధోని భుజం పై చేయివేసి అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

వెల్ డన్ ధోని.. నీ కెప్టెన్సీ లో మూడు మేజర్ టోర్నీలు గెలవగా అందులో రెండు ప్రపంచకప్ లు ఉన్నాయని ప్రశంసించాడు. నీ కెప్టెన్సీ లో జట్టుకు సేవలందించాను. ప్రస్తుతం నీచేతిలో కెప్టెన్సీ లేదు.ఇప్పటికైనా సిక్సర్ లపై దృష్టి పెడతావా ? అంటూ ప్రశ్నించాడు. తాను 10 ఏళ్లలో కెరీర్ ని ఎంతగానో ఎంజాయ్ చేశానని చెత్త బంతులు పడితే మాత్రం వదిలే ప్రసక్తే లేదని ధోని బదులిచ్చాడు.నీలాంటి ఆటగాళ్లు ఆరుబంతుల్లో ఆరు సిక్సర్ లు కొట్టడం, సమిష్టిగా రాణించడం వల్లే విజయాలు సాధ్యమయ్యా యని ధోనిఅన్నాడు. నెటిజన్లు ఈ వీడియో పై ధోని, యువీ ల ఫ్రెండ్ షిప్ మళ్లీ మొదలైందని అంటున్నారు.

Comments