ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

వికెట్ కీపర్ కామెంట్స్ కి ధోని ఫ్యాన్స్ ఫైర్

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఏ పర్యటనకు వెళ్లినా మంచి విజయాలను సాదించుకుంటూ వస్తోంది. విరాట్ నేతృత్వంలో జట్టు ఇప్పుడు బలంగా మారింది. టెస్టులు,వన్డేలు , టీ20 లు అని తేడా లేకుండా ఆటగాళ్లంతా సమన్వయ కృషితో రాణిస్తున్నారు. ఎందుకంటే 2019 లో జరిగే వరల్డ్ కప్ కోసం అందరు ఎదురుచూస్తున్నారు. దీంతో ఆటగాళ్లు ఇప్పటినుంచే రాటు దెలితే సెలక్టర్ల ద్రుష్టి వారిపై పడుతుంది. అయితే ప్రస్తుతం జట్టులో మోస్ట్ సీనియర్ ప్లేయర్ గా ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే వరల్డ్ కప్ కి ఉంటాడా లేదా అనేది ఇంకా కొంత మందిలో అనుమానాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కూడా క్రికెట్ అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ బాధ్యతలకు వీడ్కోలు చెప్పిన ధోని అభిమానులను ఓ విధంగా కలవరపెట్టాడు.

ప్రస్తుతం వన్డేలలో కీపర్ అండ్ బ్యాట్స్ మెన్ గా రానిస్తు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే అతని స్థానానికి ఇప్పుడు మరొక వికెట్ కీపర్ పోటీగా ఉన్నాడని వార్తలు వస్తున్న తరుణంలో వృద్ధిమాన్ సహా తాను వ్యక్తిగతంగా చేసుకున్న వ్యాఖ్యలకు ధోని అభిమానులు మండిపడుతున్నారు. వచ్చే వరల్డ్ కప్ లో ధోని తప్పకుండా ఆడాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. అయితే వృద్ధిమాన్ సాహా రీసెంట్ గా కోల్ కతా లో జరిగిన ఓ కార్యక్రమాల్లో తన భార్య కోరిక ఓకటి ఉందని అది ఏమిటంటే నేను ఎలాగైనా వరల్డ్ కప్ లో ఆడాలని ఆమె కోరిక అని చెబుతూ.. నేను అందుకోసం చాలా కృషి చేస్తున్నానని చెప్పాడు అలాగే ఇక అంతా సెలక్టర్ల నిర్ణయమని కూడా సాహా చెప్పాడు. కానీ ధోని అభిమానులు మాత్రం సాహా మంచి ఆటగాడే గాని ధోని ని మించేంత ఆటగాడు కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వచ్చే వరల్డ్ కప్ ధోనీనే ఇండియన్ వికెట్ కీపర్ గా చూడలనుకుంటున్నామని చెబుతున్నారు.

Comments