ప్రచురణ తేదీ : Dec 30, 2016 2:34 PM IST

ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ లో దొంగలు..ఏంచేసారో తెలుసా..?

cm-manish-sisodia
సామాన్యుల ఇళ్లలో దొంగలు పడడం సహజమే. అలాంటి దొంగల బారీ నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ప్రజలను పాలిస్తున్న పాలకుల కార్యాలయాలలోనే దొంగలు పడితే.. ఇక వారు ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారన్న అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి.సాక్షాత్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయం లో దొంగలు పడిన విషయం సంచలనం గా మారింది.ఆయన కార్యాలయం లోకి ప్రవేశించిన దుండగులు కంప్యూటర్లను వివిధ పత్రాలను దొంగిలించారు.

ఢిల్లీలోని పర్పత్ గంజ్ లో ఆయన కార్యాలయం లో ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగలు కార్యాలయం లోకి ప్రవేశించడానికి ముందే సిసి కెమెరాలను ధ్వంసం చేశారు.దీనితో ఈ ఘటన ఏసమయం లో జరిగిందనే అంచనాకు అధికారులు రాలేకున్నారు. కాగా ఆఫీస్ లోని విలువైన వస్తువులను, కంప్యూటర్లను, పత్రాలను దుండగులు దోచుకుని వెళ్లారు. ఫోర్సెనిక్ బృందం ఇప్పటికే ఆధారాలను సేకరించిందని కేసు దర్యాప్తులో వేగం పెంచామని పోలీస్ లు అంటున్నారు.

Comments