అమెజాన్ నుంచి ఈజీగా 166 ఫోన్లను నొక్కేశాడు.. ఎలాగంటే?

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. బిజీ బిజీ లైఫ్ లో ఎవ్వరు ఎక్కువగా షాపింగ్ లకు వెళ్లకుండా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. ఒక్క ఫోన్ ఉంటె చాలు ఎలాంటి ఫోన్ అయినా తెల్లవారే సరికి రప్పించవచ్చు. అయితే కొన్ని సార్లు ఆన్ లైన్ షాపింగ్ లలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో మోసాలు జరిగాయి. బుక్ చేసిన ప్రాడక్ట్ రాకుండా ఒక్కోసారి కొన్ని డమ్మీ ప్రాడక్ట్ లు వచ్చేవి. అయితే ఈ సారి ఒక యువకుడు రివర్స్ లో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ని మోసం చేశాడు. అతని ప్లాన్ గురించి తెలిస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 166 ఖరీదైన ఫోన్లను ఎటువంటి డబ్బు చెల్లించకుండా నొక్కేశాడు.

దీంతో కంపెనీకి దాదాపు 50 లక్షల వరకు మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన శివమ్ చోప్రా అనే యువకుడు మొదట హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేశాడు కానీ ఎక్కడా అతనికి ఉద్యగం రాలేదు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది మార్చ్ లో అమెజాన్ నుంచి యాపిల్ శాంసంగ్ వన్ ప్లస్ వంటి ఖరీదైన ఫోన్లను బుక్ చేశాడు. అయితే డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత శివమ్ డెలివరి ఇచ్చిన అడ్రస్ కి కాకుండా వేరే చోటుకు రమ్మని చెప్పి ప్రాడక్ట్ తీసుకునే వాడు. శివమ్ ఫెక్ అకౌంట్స్ తో ఆన్ లైన్ పేమెంట్ కరెక్ట్ గానే చేసేవాడు.

కానీ డెలివరీ వచ్చిన తరువాత అందులో మొబైల్స్ లేవని కంప్లెయింట్ ఇచ్చేవాడు. దీంతో ఆల్ రెడీ ఆన్ లైన్ పేమెంట్ చేశాడు కాబట్టి కంపెనీ పాలసీ ప్రకారం వెంటనే రిఫండ్ లభిస్తుంది. ఇలా శివమ్ 166 ఫోన్లను అమెజాన్ నుంచి మోసం చేసి తీసుకున్నాడు. దాదాపు 50 లక్షల వరకు కంపెనీ నష్టపోయింది. దీంతో పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో అతన్ని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే అతనికి జైన్ అనే చిన్న టెలికం స్టోర్ ఓనర్ కూడా సహకరించాడని పోలీసులు గుర్తించారు. దాదాపు 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ లను శివమ్ కు ఇచ్చినట్లు పోలీసులు నిర్దారించారు.

Comments