ప్రచురణ తేదీ : Dec 3, 2017 4:17 PM IST

ఢిల్లీ టెస్టు మ్యాచ్ పై కాలుష్యం కాటు..క్రికెట్ చరిత్రలో తొలిసారి..!

దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కాలుష్యం తీవ్రత పెరిగిపోయింది. గాలిలో నాణ్యమైన ఆక్సిజెన్ తగ్గిపోయింది. ఢిల్లీలోని పలు స్కూల్స్, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాలుష్యం ప్రభావం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఇండియా, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ పై కూడా పడింది. దీనితో ఆట 20 నిమిషాల పాటు ఆగిపోయింది.

గాలిలో ఆక్సిజెన్ శాతం తగ్గడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఇన్నింగ్స్ 123 వ ఓవర్ లో శ్రీలంక బౌలర్ గమగే ఆయాసంతో ఆగిపోయాడు. ఫియోజి వచ్చిన తరువాత ఆటగాళ్లు మ్యాచ్ నిలిపివేయాలని అంపైర్లని సంప్రదించారు. అంపైర్లు రిఫరీతో చర్చించారు. రిఫరీ వైద్యుని సలహా తీసుకున్న తరువాత ఇద్దరు కెప్టెన్ లతో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. కోహ్లీ మ్యాచ్ కొనసాగించేందుకు ఇష్టపడగా, శ్రీలంక కెప్టెన్ చండీమల్ అయిష్టంగా ఒప్పుకున్నాడు. దీనితో ఆటగాళ్లంతా మాస్కులు ధరించి మైదానంలోకి దిగారు. ఆటగాళ్లంతా మాస్కులు ధరించి ఆడడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

Comments