ప్రచురణ తేదీ : Mar 2, 2018 4:29 PM IST

ఘోర అగ్ని ప్రమాదం…౩౦ మంది సజీవ దహనం..!

·మంటలు చెలరేగడంతో 30 మంది అక్కడిక్కడే మృత్యువాత

అజెర్ బైజాన్ దేశ రాజధాని బకు నగరంలో ఒక్కసారిగా ఘోర ప్రమాదం సంభవించింది. బకు పట్టణంలోని హెల్త్‌ సెంటర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేస్కోవడంతో ప్రమాదంలో 30 మంది సజీవదహం కాగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు మిగిలిన వారికి స్వల్ప గాయాలతో ప్రమాద హుతినుమచి తప్పించుకున్నారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక న్యూస్‌ ఏజెన్సీ ఏపీఏ రిపోర్టు అందచేసింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమాసియా, తూర్పు యూరప్ దేశాల సరిహద్దు వెంబడి అజెర్‌బైజాన్ దేశం మనకి కానవస్తుంది.

Comments