కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చెంప చెల్లుమందా..?

ప్రస్తుత ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో భాజాపాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ మన దేశానికి సర్వమంగళం పాడేశారు. నిత్త నిలువునా ముంచి సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త కష్టాలు మెడపైకి తెచ్చుకున్నారు. కర్ణాటకా హుబ్లీ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటన చేసారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్‌లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్‌ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్‌ వన్‌’ అని అమిత్‌ షా నోరుజారడం మొదలైనప్పటినిండి.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్‌ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చివరికి బీజేపీ పరిస్తి ఏమవుతుందా అని దేశమంతా ఆలోచనలో పడింది.

Comments