ఫైనల్ గా పుణేకి చెన్నై!

రెండేళ్ల నిషేధం తరువాత తిరిగి ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ అప్పటిలానే మంచి విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి అభిమానులను ఎంతో ఆనందాన్నీ ఇచ్చింది. అయితే ఇప్పుడు చెన్నై అభిమానులు కు అక్కడి పరిస్థితులు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. విశాఖపట్నం లేదా త్రివేండ్రం, పుణె, రాజ్‌ కోట్‌ వంటి స్థావరాల్లో చెన్నై కి ఆతిధ్యం ఇవ్వడానికి స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవల బిసిసిఐ తెలిపింది.

ప్రస్తుతం తమిళనాడులో కావేరి నది జలాల వివాదం ఉదృత స్థాయికి చేరింది. ఐపీఎల్ ని అడ్డుకుంటామని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చెన్నైలో మొన్న జరిగిన మ్యాచ్ కు పోలీసుల బందోబస్తు లేకపోతె ఆందోళన తీవ్ర స్థాయిలో అటపై ప్రభావం చూపేది. అయితే పరిస్థితులు ఇప్పటిలో అదుపులోకి వచ్చే అవకాశం లేదని ఐపీఎల్ యాజమాన్యం టీమ్ హోమ్ టౌన్ ను మార్చేసింది. ధోని సేనకి ఇచ్చిన నాలుగు స్టేడియంల ఆప్షన్స్ లలో ఏదైనా హోమ్ గ్రౌండ్ గా సలెక్ట్ చేసుకోవాలని తెలుపగా పూణే ని సలెక్ట్ చేసుకున్నారు. వైజాగ్ లో సెట్ చేద్దామనిక్ అనుకున్నప్పటికీ ప్రత్యేక హోదా ఆందోళనలు చెలరేగుతున్నాయని చెన్నై పూణే ను సెలెక్ట్ చేసుకుంది. గతంలో ధోని పూణే జట్టులో రెండేళ్లు కొనసాగిన సంగతి తెలిసిందే.

Comments