క్రైం కహానీ: రేప్ కేసులో స్వామీజీకి మళ్లీ చుక్కెదురు… వృద్ధాప్యంలో 11మందిని లైంగికంగా వేధించి..!!

s4

s1రేప్ కేసులో స్వామీజీకి మళ్లీ చుక్కెదురు: సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషుల ఆలోచనలు మాత్రం పాత కాలపు పద్ధతులనే ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది బాబాలు లైంగిక కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ప్రజలు మాత్రం బాబాలను ఆదరిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు మరో సారి నిరాశపడక తప్పలేదు. అయితే ఆయనకి ఆనారోగ్యంగా ఉందని అందుకు తమను బెయిల్ పై విడుదలచేయాలని ఆయన పెట్టుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఒకవేళ ఆశారాం చికిత్స పొందాలనుకుంటే ఆయన ఎయిమ్స్‌లో లేదా జోధ్‌పూర్‌లో లేదా రాజస్థాన్ ఆయుర్వేద ఆస్పత్రిలో పొందొచ్చని, అయితే అప్పుడు కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఆగస్టు 31వ తేదీన జోధ్‌పూర్ పోలీసులు ఆశారాం బాపును అరెస్టుచేశారు. ఆయన అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును ఆగస్టు 9న హైకోర్టు తిరస్కరించింది.

 

s2

వృద్ధాప్యంలో 11మందిని లైంగికంగా వేధించి: హిందూ సాంప్రదాయ దేశాల్లో తప్పితే పాశ్చాత్య నాగరిగత వర్ధిల్లుతున్న దేశాల్లో సాంప్రదాయాలకు, ఆచారాలకు, పద్దతులకు తిలోదకాలు అద్దుతారానడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. 70 ఏళ్ల వయసులో ఉన్న రాబర్ట్ ఆండ్రూ ఫిడెస్ ఎల్లిస్ అనే వ్యక్తి మొత్తం 11మంది యువతులపై 2014, 2015 సంవత్సరాల మధ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఇండోనేషియా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలీ దీవిలోని ఓ రిసార్ట్‑లో పలువురు యువతులపై అతడు లైంగిక దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అతడు పది హేనేళ్లు కారాగారంలో గడపాలని ఆదేశించింది.

 

 

s3

నడిరోడ్డుపై కిరాతకం: బీహార్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. ఫకారాబాద్ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేందుకు వెళుతుండగా ఆ విద్యార్థిని ని చున్నీ పట్టుకొని లాగి దాదాపుగా 50 మీటర్లు లాక్కెళ్ళారు. అంతేకాకుండా ఆమె పై నుంచి బైక్ నడిపారు. తీవ్ర గాయాలతో బాధితురాలు ఆక్కదికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు.అయితే సఘతనలా స్థలంలో బైక్ గోతిలో పడడంతో దుండగులు బైక్ ని వదిలి పారిపోయారు. హతకులను అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని పోలీసులను డిమాన్ చేశారు.

Comments