ప్రచురణ తేదీ : Sat, Oct 7th, 2017

వాచ్ పోగొట్టుకున్న గిల్ క్రిస్ట్ భార్య..సాయం చేసిన పేస్ బుక్, ట్విట్టర్..!

మానవుని దైనందిక జీవితంలో సామజిక మాధ్యమాల ఓ ప్రభావం ఎక్కువవుతోంది. ఆ విషయం మరో మారు రుజువైంది. సమాచారం వేగంగా విస్తరించడంతో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా మాజీ ఆసీస్ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ భార్య మెల్ వాచ్ ని పోగొట్టుకుంది. ఆ వాచ్ ఆమె వద్దకు తిరిగి చేరడంలో ప్రముఖ సామజిక మాధ్యమాలు పేస్ బుక్ ట్విట్టర్ లు కీలక పాత్ర పోషించాయి. ఇటీవల గిల్ క్రిస్ట్ భార్య మెల్ తన నలుగురి పిల్లలతో హాలిడే ట్రిప్ వెళ్లారు.

డాన్స్ బారోలోని ఓవెల్ మైదానంలో స్ప్రింట్ పోటీలు జరుగుతుండడంతో మెల్ తన కుమార్తెని తీసుకుని వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చాక చేతికి వాచ్ లేదనే విషయాన్ని మెల్ గమనించారు. ఈ విషయాన్ని మెల్ తన భర్త గిల్ క్రిస్ట్ కు తెలిపారు. కొన్నేళ్ల క్రితం గిల్ క్రిస్ట్ ప్రేమతో భార్యకు ఆ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. తన భార్య ఓవల్ లో వాచ్ పోగొట్టుకుందని ఎవరికైనా దొరికితే తనకు సమాచారం ఇవ్వాలని గిల్ క్రిస్ట్ ట్విట్టర్ ద్వారా కోరారు. కాగా అమీ ముందే అనే మహిళ పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఓవల్ లో ఎవరైనా వస్తువు పోగొట్టుకుని ఉంటే వివరాలు సరిగ్గా తెలపండి. మీ వస్తువు మీకు అందిస్తా అని పేస్ బుక్ లో పేర్కొంది. ఈ విషయం గిల్ క్రిస్ట్ కు తెలిసింది. నాకు పేస్ బుక్ అకౌంట్ లేదు. నా భార్య పోగొట్టుకున్నది తెలుపు, సిల్వర్ రంగులు కలసిన వాచ్. ఈ వివరాలని అమీ కి చేరవేయవసిందిగా గిల్ క్రిస్ట్ తన ఫాలోవర్స్ ని కోరారు. దీనితో ఈ విషయం వైరల్ గా మారి అమీ అనే మహిళకు చేరింది. ఆ వాచ్ ని ఆమె గిల్ క్రిస్ట్ కు పంపారు. దీనితో గిల్ క్రిస్ట్ సంతోషం వ్యక్తం చేశారు. నా వాచ్ దొరకడంలో సహకరించిన అందరికి ధన్యవాదాలు అని గిల్ క్రిస్ట్ తెలిపాడు.

Comments