ప్రచురణ తేదీ : Jan 12, 2018 9:04 AM IST

ప్రధానిని మూడు నామాల మోడీ అంటున్న నారాయణ

సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. నిన్న జరిగిన ఒక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని పొగుడుతూ, ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి మాత్రమే కొట్టారు తప్ప అమరావతి అభివృద్ధికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని. అసలు ఆంధ్ర కు ప్రత్యేక హోదానే లేదని, అమరావతి అనేదే లేదు, పోలవరం ఊసైతే అంతకన్నా లేనే లేదని. ఈ విధంగా మోడీ, బాబుకు మూడు నామాలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబు కలల రాజధాని అమరావతిని, అక్కడ జరుగుతున్న పనులను మెచ్చుకున్నారు. చంద్రబాబు అమరావతి అభివృద్ధికి చేస్తున్న కృషి అమోఘమని, ఈ మధ్యనే తాము అమరావతి లో పర్యటించామని, ఇంకొక 60-70 ఏళ్ళు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తే అది చంద్రబాబుకి లాభం, బిజెపికి నష్టంగా పరిణమించవచ్చని, కాబట్టి ఏపీ లో తామే బలపడేలా మోడీ చూసుకుంటున్నారని అన్నారు. రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారని, దళిత విద్యార్థుల పై దాడులు వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ఆయన మంది పడ్డారు. గోసంరక్షణ పేరుతో మతోన్మాదులు ఎంతోమందిని బలి తీసుకున్నారని, లక్షల కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న బడా బాబులు బయట కాలర్లు ఎగరేసి తిరుగుతున్నారని, నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని ఒక్కొక్కరిని 15 లక్షల చప్పున బ్యాంకులో వేస్తానన్న మోడీ ఇప్పటివరకు ఆ నగదు ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలని ఆయన ఘాటు విమర్శలు చేశారు.

ఆర్బీఐ అనుమతి లేకుండా లక్షల్లో 2 వేలరూపాయల నోట్లు ఏవిధంగా బయటకి వచ్చాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ఆర్బీఐ గవర్నర్ కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్ గా తయారయ్యారన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్రాన్ని ప్రత్యేకహోదా అడిగే దమ్ము చంద్రబాబు లేదని అన్నారు. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం విషయంలో దేశం బాగా వెనుకపడుతోందని, దేశంలోని క్షయ రోగుల విషయం లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని మండిపడ్డారు. టిడిపి అధికారం లోకి వచ్చాక రాష్ట్రంలో అధికారిక లెక్కలప్రకారం మొత్తం 13 జిల్లాల్లో, 3987 మంది కేవలం క్షయ వ్యాధితోనే చనిపోయారన్నది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలన్నారు. అన్ని విభాగాల్లో అవినీతి అమితంగా పెరిగిన మన దేశంలో ఇటీవల ఎసిబి దాడుల్లో దేవాదాయ శాఖ అధికారి ఇంట్లో 150 కోట్లు, టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 500 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ మూడున్నరేళ్ల కాలం లో 2500 కోట్ల మేర ఆస్తులు సీజ్ చేశారని, అధేవిధం గా ఎం ఎల్ ఏ లు, యం పి ల ఇళ్ల పైకూడా ఏ సి బి దాడులు చేయాలి, అప్పుడే ఎవరి చరిత్ర ఏమిటో తెలుస్తుందని అన్నారు…

Comments