ప్రచురణ తేదీ : Jun 6, 2018 10:02 AM IST

కాంగ్రెస్ కు ఇదే మంచి అవకాశం.. టార్గెట్ ఎన్డీయే!

భారత జనతా పార్టీ హవాకు 2014 ఎన్నికల్లో ఒక్కసారిగా అపజయంతో కుప్పకూలిపోయిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందా అని దేశ రాజకీయాల్లో చాలా వరకు చర్చనీయాంశంగా అయ్యింది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలంగానే ఉన్నా కూడా మళ్లీ తన స్టామినాను చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేలా సందేహం కూడా కలుగుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికలో గెలవాలని పార్టీ అధిష్టానం చాలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మోడీ కూడా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అవకాశాన్ని కొంచెం కూడా ఇవ్వకూడదు అనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ముందుకు వెళుతున్నారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ముందులా కనిపించడం లేదు. బిజెపికి ఎక్కువగా వ్యతిరేకంగా కామెంట్స్ అందుతున్నాయి. పరిస్థితి అర్ధం చేసుకున్న మోడీ అమిత్ షా బీజేపీ పెద్దలను రంగంలోకి దింపుతున్నారు. చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ స్థానాన్ని కాపాడుకోవడంలో విఫలం అవుతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే బీజేపీకి కొంచెం కూడా అవకాశం లేదు. ఎన్డీయే కూటమికి చంద్రబాబు కేసీఆర్ గుడ్ బాయ్ చెప్పేశారు. దేశంలో మరికొన్ని స్థానిక పార్టీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కాంగ్రస్ వినియోగించుకోవాలని ప్లాన్ వేసింది. ఇది కాంగ్రెస్ కు బూస్ట్ లాంటిది.

మోడీ ప్రభుత్వంపై చాలా రాష్ట్రాల్లో పార్టీలన్నీ రివర్స్ అయ్యాయి. ఎన్డీయే కూటమిని దించాలనే టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఏలా చూసుకున్నా ఇది కాంగ్రెస్ కు మంచి అవకాశం. బీజేపీ వ్యతిరేఖ పార్టీలను తన వైపుకు తిప్పుకొని వచ్చే ఎలక్షన్స్ లో గెలవాలని అనుకుంటోంది. అందుకోసం రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీతో అలాగే పార్టీ పెద్దలతో ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని వారు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Comments