ప్రచురణ తేదీ : Sun, May 6th, 2018

కాంగ్రెస్ కు కర్ణాటక ఎలక్షన్స్ ఎంత కీలకమంటే?

చాలా కాలం తరువాత గెలిచి అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ పార్టీని దేశమంతా వ్యాప్తి చేయడానికి గత నాలుగేళ్లుగా శ్రమిస్తూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మొన్నటి వరకు బాగానే గెలిచినా ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి అనుమానంగానే ఉంది. కర్ణాటక ఎలక్షన్ ఆ పార్టీకి కీలకం కానుంది. కాంగ్రెస్ కూడా ఈ ఎలక్షన్స్ ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోసారి కాంగ్రెస్ లో తన జెండా ఎగురవేసి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే పార్టీ 2019 ఎన్నికల రిజల్ట్స్ పై ఒక అంచనా వేసుకోవచ్చు.

కానీ కాంగ్రెస్ పాలనపై అక్కడ కొన్ని మైనెస్ లు ఉన్నాయి. అభివృద్ధి లో లోపాలు అంతర్గత విభేదాలు కొంత నెగిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అయితే గెలుపుపై నమ్మకంతో ఉంది. వీక్ గా ఉన్న స్థానాల్లో ఎక్కువగా ప్రచారాలను చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీతో పెద్దగా నెగ్గలేకపోయింది. సీఎం సీటును దక్కించుకునే అవాకాశం ఉన్నప్పటికీ రాహుల్ మ్యాజిక్ పనిచేయలేదు. అధికారాన్ని అందుకోవాలంటే కొన్ని సీట్లు అవసరమున్న సమయంలో వారి మద్దతును అందుకోలేదు. బీజేపీ చక చక్యంగా వ్యవహరించి ఇండిపెండెంట్ గా గెలిచినా వారి మద్దతును అందుకుంది. 165 నియజకవర్గాలున్న కర్ణాటకలో 120 కి పైగా దక్కించుకుంటుందని టాక్ వస్తున్నా ఓటర్లు మార్పు కోరుకుంటే బీజేపీ కి కలిసొచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యమైన ఈ ఎన్నికల్లో ఎంతవరకు విజయం అందుతుందో చూడాలి.

Comments