ప్రచురణ తేదీ : Nov 30, 2017 8:17 AM IST

ఇవాంకకు ఆ విషయం తెలియదు..లేకుంటే కేటీఆర్ ని స్టేజి పైనే..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. బుధవారం రాత్రి ఆమె అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. తెలుగు రాష్ట్రాల్లో అంతా ఇవాంక పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అలాగే ఇవాంక టూర్ వలన తెలంగాణాలో పొలిటికల్ సెగ కూడా మొదలైంది. ఇవాంక రాకతో యుద్ధ ప్రతాపదికన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలని చేసింది. దీనిపై ఎవరికి వారు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. జీఈఎస్ సదస్సు మొత్తంలో ఇవాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మరో వైపు మంత్రి కేటీఆర్ భాద్యత తీసుకుని మరీ జీఈఎస్ సదస్సుని నడిపించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కాంగ్రెస్ నేతలు వర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది.

జీఈఎస్ సదస్సులో మహిళలు వ్యాపార రంగం లో ఎలా రాణించాలి, వివిధ రంగాలలో వారిని ఎలా వృద్ధి లోకి తీసుకురావాలి అనే అంశం పై చర్చ జరిగింది. రెండవరోజు జరిగిన ప్లినరీలో ఇవాంక తోపాటు మరో ముగ్గురు మహిళా ఉద్దండులని సమన్వయ పరుస్తూ కేటీఆర్ ప్లినరీ నడిపించారు. కేటీఆర్ ప్రతిభా పాటవాలకు ఇవాంక కూడా ఫిదా అయి ఓసారి అమెరికా పర్యటన రావాలని ఆహ్వానించినట్లు టాక్. కానీ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ పై, కేసీఆర్ పై ఘాటు విమర్శలే చేస్తోంది. కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. ఈ విషయం ఇవాంకకు తెలిసి ఉంటె కేటీఆర్ ని స్టేజి పైనే నిలదీసేవారని డీకే అరుణ లాంటి సీనియర్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. కేటీఆర్ ప్రధాన మంత్రి పక్కన ఏ హోదాలో కుర్చున్నారనేది మరో సీనియర్ నేత వీహెచ్ ప్రశ్న. మెట్రో ప్రారంభోత్సవానికి హైదరాబాద్ ప్రధమ పౌరుడైన మేయర్ కు స్వాగతం పలుకక పోవడం దారుణం అని ఆయన మండి పడ్డారు.

Comments