ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

రంజుగా మారిన రాజకీయం.. జగన్ కు ప్రేమలేఖల వెల్లువ..!!

ప్రతిపక్షాలు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని అభివర్ణించే కాంగ్రెస్- వైసిపి మధ్య ప్రేమ రాయబారాలు మొదలయ్యాయా ? 2019 ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు వేదిక కాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టి-కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా తాజా రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జగన్ పార్టీ తమతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని.. 2019 ఎన్నికల ప్రణాళికలలో భాగంగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని అద్దంకి దయాకర్ ధృవీకరించారు. టిడిపి మరియు టిఆర్ ఎస్ పార్టీల మధ్య పొత్తు పొడిచే సూచనలు కనిపిస్తుండడంతో ఆయన ఓ టివి కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ మధ్య జరిగిన రహస్య చర్యలని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పటికే తాము పొత్తు ప్రపోజల్స్ ని జగన్ కు పంపామని అన్నారు. అటు వైపు నుంచి సమాధానం రావాల్సి ఉందని అన్నారు. టిఆర్ ఎస్ – టిడిపి మధ్య పొత్తు కుదిరితే జగన్ తప్పని సరిగా తమతోనే పొత్తు పెట్టుకునే రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయని కూడా అన్నారు. తెలంగాణాలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఫలితం ఉంటుందేమోకాని, అదే ఏపీలో అయితే లాభంకన్నా జగన్ కే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఏదిఏమైనా 2019 ఎన్నికల నేపథ్యంలో పొత్తు చర్చలు అప్పుడే మొదలైపోయాయని, రాజకీయ పార్టీ వారి మిత్రులని ఎంచుకునే పనిలో పథకాలు రచించుకుంటున్నట్లు రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ నయా పొత్తుల విషయంలో తెలుగురాష్ట్రాల్లో బలం లేని బిజెపి పాత్ర ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Comments