ప్రచురణ తేదీ : Jan 1, 2017 3:45 AM IST

వైకాపా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.. తెదేపా కు ఇంక తిరుగులేదు

chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు మరియు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో వైస్సార్సీపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకులో ఒకటి నుండి రెండు శాతం కాంగ్రెస్ కు వెళ్తుందని అయినా కాంగ్రెస్ బలపడదని అన్నారు. కాంగ్రెస్ నేతలకే ఆ పార్టీపై నమ్మకం లేదని, ప్రజలకు కాంగ్రెస్ పై అసలు విశ్వాసమే లేదని చంద్రబాబు అన్నారు.

సంక్రాంతి పండగ కారణంగా జన్మభూమి కార్యక్రమాన్ని కొద్దీ రోజులు వాయిదా వేస్తె బాగుంటుందన్న కొందరు నేతల అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన మాత్రం వాయిదా వేయడానికి ససేమిరా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా దీనిని నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు, జన్మ భూమి కమిటీలు కలిసి పని చేయాలనీ, ఇబ్బందులు వస్తే సహించను అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కి కనీస పోటీ కూడా ఉండదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments