ప్రచురణ తేదీ : Nov 18, 2016 10:34 AM IST

సామాన్యుడికి మోడీ మీద ఒళ్ళు మండుతోంది:

modi1
పాత కరన్సీ ని మార్చుకునే విషయం లో నిన్నటి వరకూ కాస్త సౌలభ్యం ఉండేది. నాలుగువేల ఐదు వందల వరకూ మార్చుకోవడానికి మోడీ సర్కారు అనుమతిని నిన్నటి వరకే ఇచ్చింది ఇవాళ నుంచీ మామూలుగా 2000 రూపాయల వరకే కరన్సీ ని మార్చుకునేలా నిబంధనలు సీరియస్ చేసారు. దీంతో క్యూ లైన్ లలో జనాలు చాలా సీరియస్ అవుతున్నారు. ఒకరు రోజుకు రెండు సార్లు మరి కొందరు ప్రతీ రోజూ , ఇంకొందరు రోజుకి రోజు మార్చి ఇలా తమ దగ్గర ఉన్న డబ్బు ని క్యూ లైన్లలో నుంచుని మార్చుకుంటున్నారు అని ఈ కొత్త నిబంధన తో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూ. 2 వేలు మాత్రమే మార్చుకుని నెలన్నర రోజులు ఎలా బతకాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో వేసుకుని, ఆపై తీసుకుందామంటే, ఏటీఎం సెంటర్లు పని చేయడం లేదని వాపోతున్న ప్రజలు, ఇలా నగదు మార్పిడిపైనా ఆంక్షలు విధిస్తే ఎలాగని అడుగుతున్న పరిస్థితి నెలకొంది. కాగా, నగదును మార్చుకున్న వారే పదేపదే వస్తుండటం, పేదలను, కూలీలను అడ్డుపెట్టుకుని, వారిని క్యూలైన్లలో ఉంచి, అక్రమార్కులు తమ బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మార్పిడి పరిమితిని తగ్గించినట్టు అధికారులు చెబుతుండటం గమనార్హం.

Comments