ప్రచురణ తేదీ : Wed, Aug 9th, 2017

పిల్లలని కాపాడుకోవడానికి రౌడీ షీటర్ ని హత్య చేసాడు! అతనికి ఎ శిక్ష వేస్తారు?

హైదరాబాద్ అంటే రౌడీల గొడవ ఎక్కువగా ఉంటుంది. జనం మీద పడి డబ్బులు వసూలు చేయడం. ఇవ్వకపోతే బెదిరింపులకి పాల్పడటం. లేదంటే దాడికి పాల్పడటం చేస్తూ ఉంటారు. అయితే ఇలా దందాలు చేస్తూ, రౌడీ మామూలు వసూలు చేస్తూ, మధ్యతరగతి బ్రతుకుల మీద పడితే కొత్త కాలం భరిస్తారు. ఇక ఓపిక నశిస్తే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు అలా ఓ మధ్యతరగతి వ్యక్తికి కోపం వచ్చింది. డబ్బుల కోసం బెదిరిస్తూ, పిల్లలని కిడ్నాప్ చేస్తా అని బెదిరింపులకి పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్ ని ఆవేశంతో కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ లో ఇషాక్ అనే రౌడీ షీటర్ ఉన్నాడు. అతని మీద పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఉన్నాయి. అతని మీద పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయాలని అనుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేసుకోవడంతో మారడానికి అవకాశం ఇచ్చారు. అయితే అతనిలో ఎలాంటి మార్పు రాలేదు ఎప్పటి లాగే రోడ్డు మీదకి వెళ్తూ షాపుల వాళ్ళని మామూళ్ళు అడగడం మొదలుపెట్టి, బెదిరింపులకి పాల్పడం చేస్తున్నాడు. అలాగే కిరాణా దుకాణం నడుపుకుంటున్న సలీంని డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీ పిల్లలని కిడ్నాప్ చేస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే అతను రెండు మూడు సార్లు బ్రతిమలాడుకున్న ఇషాక్ పద్ధతి మార్చుకోలేదు. తిరిగి సలీం మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆవేశం ఎక్కువైన సలీం పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో ఇషాక్ ని బలంగా కొట్టాడు. దీంతో అతను అక్కడే కూలిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు. అతన్ని హత్య చేసిందుకు గాను సలీంని అరెస్ట్ చేసారు. అయితే తన పిల్లలని కాపాడుకోవాలని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ ని చంపినా అతనికి చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది చూడాలి.

Comments