ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

జల్లి కట్టు, కోడి పందేలను అడ్డుకునే దమ్ముందా..?

kodi
సంక్రాంతి పండగ వస్తే పందెం రాయుళ్లదే సందడంతా. తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేల సందడి నెలకొంటే, తమిళనాడు లో జల్లి కట్టు సందడి కనిపిస్తుంది. కానీ కోడిపందేలపై హైకోర్టు, జల్లి కట్టుపై సుప్రీం ఇప్పటికే వాటిని నిర్వహించడానికి వీలు లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆరు నూరైనా కోడి పందేలను నిర్వహించి తీరుతామని పందెం రాయుళ్లు ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలో భీష్మించుకుని కూర్చున్నారు. జల్లికట్టు ప్రభావం ఏపీ లోని చిత్తూరు జిల్లా పై కూడా ఉంటుంది. చిత్తూరు లోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు తమిళనాడులో వలె ఆడుతారు. సుప్రీం కోర్టు జల్లికట్టుని నిషేదించిన నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళలను జరుగుతున్నాయి.జల్లికట్టు, కోడి పందేలు సంప్రదాయంగా వస్తున్న క్రీడలని పందెం రాయుళ్లు వారి వాదనని వినిపిస్తున్నారు.

కాగా ఇప్పటికే హైకోర్టు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాల నేపథ్యంలో కోడిపందేలు జరుగుతాయా ? లేదా ? అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కాగా పోలీసులు కోడిపందేలు అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఏపీ లోని కొన్ని ప్రాంతాలలో బాగా పేరు మోసిన రాజకీయ నాయకులే దగ్గరుండి కోడి పందేలను జరిపించడం మనం చూస్తున్నాం. కాగా ఇప్పటికే ఏపీ లో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందేలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Comments