ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

వీడియో : కేటీఆర్ పై కేసీఆర్ జోకులు అదిరిపోయాయ్..!


ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల, సిద్ది పేట జిల్లాలో పర్యటన హుషారుగా జరిగింది. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకు కేటీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కలక్టరేట్ భవనాలకు శంకుస్థాపన చేయడానికి కేసీఆర్ ఆయా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేటీఆర్ ని ప్రశంసిస్తూ కేసీఆర్ విసిరిసిన ఛలోక్తులు సభలో నవ్వుల్ పువ్వులు పూయించాయి.

ఈ మధ్యన మీ ఎమ్మెల్యే రామారావు బాగా హుషారయ్యాడు. సిరిసిల్ల నీళ్లు బాగా వంటబట్టాయి. మొదట సిరిసిల్లని జిల్లా చేస్తే చాలు.. ఇంకేమి అడగనని అన్నాడు. కానీ ఇప్పు మళ్లీ 200 కోట్ల వరకూ అడుగుతున్నాడు. దీనితో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి. కేసీఆర్ సిద్దిపేటలో కూడా పర్యటించి హరీష్ రావు పై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

Comments