ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

‘పార్టీ మారను’ అంటూనే ఏర్పాట్లు చేసుకుంటున్న చిరంజీవి..?

chiru
చిరంజీవి రాజకీయాల్లో ఆశించినంత మేర విజయం సాధించలేదన్న విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం దానిని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు కేంద్రం లోనూ అధికారంలో లేదు. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కూడా లేదు.ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడిగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తమపార్టీ అధికారంలో లేకపోవడంతో చిరంజీవి తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టి 150 వ చిత్రం ఖైదీ నెం 150 లో నటించిన విషయం తెలిసిందే. చిరు రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నా..తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ మద్యన చిరంజీవి టిడిపిలో చేరుతారని, బిజెపిలో చేరుతారని జోరుగా వార్తలు వచ్చాయి. వాటిని చిరంజీవి అప్పట్లో ఖండించారు.తాను పార్టీ మారడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏపీనుంచి గ్లామర్ ఉన్న వ్యక్తి చిరంజీవి మాత్రమే. పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన ఏ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాలేదు. దీనితో ఆయన కాంగ్రెస్ కు దూరమవుతున్నారన్న వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల ఖైదీ నెం 150 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిజెపి నేత ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరుకావడంతో చిరు రాజకీయ భవిష్యత్తు పై జోరుగా ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. చిరంజీవి బిజెపి లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఖైదీ చిత్రం విడుదలతరువాత చిరు తన రాజకీయ భవిష్యత్తు పై ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments