ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

మెగా మిస్టేక్ రిపీట్ అవుతుందా..చిరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్..?


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చిరంజీవి చేసిన చారిత్రాత్మక తప్పిదంగా ఇప్పటికీ రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతారు. పదవుల కోసం చిరంజీవి పార్టీని సోనియా కాళ్ల ముందు బేరానికి పెట్టేశారని ఆ సమయంలో స్వయంగా మెగాస్టార్ అభిమానులే ఆరోపించారు. ఆ తరువాత తెలుగు రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చిరంజీవి రాజకీయ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కానీ కాంగ్రెస్ ఆపార్టీ నుంచి లంభించిన రాజ్య సభ సభ్యత్వాన్ని చిరు కొనాగిస్తున్నారు. ఆ పదవికి కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ తో కాలం చెల్లిపోనుంది. ఇక ఆ తరువాత మెగాస్టార్ ఏం చేస్తారు ? పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతారా లేక రాజకీయ పునరాగమనం చేస్తారా ? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓ సంచలనంలా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొందరు చిరంజీవి వెంట నడిస్తే మరి కొంతమంది నేతలు సొంత దారి చూసుకున్నారు. 2014 తరువాత ప్రజారాజ్యం నుంచి వచ్చిన వారిలో చిరు తో మిగిలవారు చాలా తక్కువ. అంతా తలో పార్టీలో సెటిల్ అయిపోయారు. కానీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా తమకు రాజకీయ అవకాశం కల్పించిన చిరంజీవి పై కృతజ్ఞత చూపే గంటా శ్రీనివాస్ వంటి నేతలు ఉన్నారు. ఇతర పార్టీల్లో ఉన్నా చిరు తాము రుణపడి ఉన్నామని చెబుతారు. కాగా ఆపరిచయాల ద్వారా చిరు పొలిటికల్ గా మరో ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అనే చర్చ జరుగుతోంది. అటు టిడిపి నుంచి ఇటు వైసిపి నుంచి చిరుకు ఆఫర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పదవి కోసం పార్టీని మంట గాలిపారనే అపవాదుని ఎదుర్కొంటున్న చిరంజీవి మరో మారు ఆ సాహసం చేస్తాడా ! ఒకవేళ అలా చేస్తే చిరు చరిష్మా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు కూడా చిరుకి సలహా ఇస్తున్నారట. రాజ్యసభ ఎంపీ పదవీకాలం ముగిసినా పార్టీ మారవద్దని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవిని.. అదే కొనసాగించమని సలహా ఇస్తున్నారట.

Comments