రజనీకాంత్ తో చిదంబరానికి పనేంటి..?

rajanikanth-chidambaram
జయలలిత మరణం తరువాత తమిళనాడు లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని భేటీ కావడం చర్చనీయాంశం అయ్యింది. మంగళవారం వీరిద్దరి మధ్య రజనీకాంత్ నివాసంలో భేటీ జరిగింది. చిదంబరం..రజనీకాంత్ ఇంటికి వెళ్లగా రజని ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కూడా చర్చించారని అంటున్నారు. రజనీకాంత్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆయన అంటే విపరీతమైన గౌరవం. అందుకోసమే చిదంబరం రజనితో భేటీ అయ్యారు. భారతదేశ ఆర్ధిక పరిస్థితి, పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురైన సమస్యలు, పెద్దనోట్ల రద్దుతో భారత ఆర్ధిక రంగం ఎలా కురుకుపోతుందో చిదంబరం రజనీకాంత్ కు వివరించినట్లు సమాచారం.

Comments