చంద్రబాబు మారలేదు, మారరు, మారబోరు అంటున్న బొత్స

వైఎస్‌ఆర్‌సిపి నేత బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండి పడ్డారు. చంద్రబాబు చెప్పేవి అన్ని మోసపూరిత మాటలు అని, ఆంధ్ర ప్రజలు ఆయన మానిఫెస్టో లో, ప్రచారం సమయం లో ఇచ్చిన హామీలని నమ్మి ఓట్లు వేశారని, కానీ చెప్పినది ఒకటి చేసేది ఒకటి అనే చందాన, అధికార పీఠం దక్కాక ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయారని ఆయన అన్నారు, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ప్రతి విమర్శలు చేయడమే ఆయన నైజం అని అన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రోజెక్టుల విషయం లో 50 వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పుకుంటున్న బాబు వాటికి లెక్కలు చూపాలి, వాస్తవంగా ప్రభుత్వం తరపున ఖర్చు చేసింది మాత్రం 27,898 కోట్లే నని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని ఎక్కడ నిర్మించారో చెప్పాలి, అలాగే ఇరిగేషన్ ప్రోజక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇప్పటివరకు ఏ మాత్రం మారని చంద్రబాబు, అభివృద్ధి చేసాం అనే విషయం చేతల్లో చూపించి, తన హామీలు పూర్తిగా నెరవేర్చి అప్పుడు మాట్లాడాలి అన్నారు.

Comments