‘చంద్రన్న భీమా’ ఆనం బ్రదర్స్ కు ఎందుకబ్బా..?

నెల్లూరు రాజకీయాల్లో ఆనం సోదరులది తిరుగులేని ఆధిపత్యం. కాంగ్రెస్ అధికారం కోల్పోయాక ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆనం సోదరులు కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల తరువాత ఆనం సోదరులు టిడిపి గూటికి చేరారు. అధినేత చంద్రబాఉ నుంచి కొని హామీలు తీసుకుని వారు టీడీపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. ఆ హామీలు ఎంతకీ చంద్రబాబు నెరవేర్చకపోవడంతో ఆనం బ్రదర్స్ జగన్ గూటికి చేరేందుకు ప్రయ్తన్లు చేస్తునట్లు ఇప్పుడు ప్రచారం సాగుతోంది. ఆనం సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో వారిని మరో రకంగా సంతృప్తి పరిచే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రన్న భీమా మరియు ఎన్టీఆర్ హౌసింగ్ ప్రాజెక్ట్ ల భాద్యతలను ఆనం బ్రదర్స్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి ఫైనాన్స్ మరియు ప్లానింగ్ లో దిట్ట కాబట్టి ఆయనకు ఈ భాద్యతలను అప్పగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ముగ్గరు ఐఏఎస్ అధికారుల ప్రయవేక్షణలో చంద్రబాబు ఈ పథకాలను ప్రారంభించనున్నారు.

Comments