ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

చంద్రబాబుకు ఇక అన్నీ ఆయనేనా..?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు తన ఒత్తిడిని తగ్గించుకోవాలని చూస్తుండడంతో పార్టీ ముఖ్యనేతలుకూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా చంద్రబాబు ఒత్తిడి తగ్గించేందుకు ఆయనకు ఒక సహాయకుడి లాంటి వ్యక్తిని నియమించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబుకు తోడుగా ఉండేందుకు పార్టీలోని కీలక నేతనే చంద్రబాబు పక్కనే ఉంచాలని పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఇతర నేతలతో ప్రస్తావించారట. దీనికి ఎవరైతే బావుంటారని ఆలోచించగా మంత్రి అచ్చెన్నాయుడు అయితే సరిపోతారని అన్నారట. గతంలో గతంలో రాజశేఖర్ రెడ్డి స్థానంలో ఉండి కెవివి రామ చంద్రరావు అన్ని పనులను చక్కబెట్టేవారు. కీలక విషయాలను మాత్రమే వైఎస్ తో చర్చించే వారు. అలాగే చంద్రబాబు వద్దకు అనవసర విషయాలు రాకుండా ఓ వ్యక్తి ఉండాలని తెలుగుదేశం పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. మరి ఆ భాద్యతలు అచ్చెన్నాయుడికి ఎప్పుడు దక్కుతాయో మరి.

Comments