ప్రచురణ తేదీ : Dec 31, 2016 3:50 AM IST

డబ్బొచ్చిన ఉత్సాహంలో బాబు..మాట నిలబెట్టుకుంటారా..?

chandrababu-naidu
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు కు గానూ రూ 1980 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా డబ్బు మహిమో ఏమో కానీ ఇప్పటివరకు నత్తనడకగా సాగుతున్న పోలవరం పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు లో కీలక దశ పనులను ప్రారంభించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ పనులు జరగడం విశేషం.అమరావతి రాజధాని వచ్చిన తరువాత ఈపనులు చేసినా నిరాటంకంగా జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇదంతా డబ్బు మహిమే అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ రెండేళ్లలో పోలవరం కు నిధులు మంజూరు చేయడానికి నీళ్లు నమిలిన కేంద్రం కొద్దీ రోజుల క్రితమే ఏకంగా రూ 1980 కోట్లని విడుదలచేయడం విశేషం.దీనితో చంద్రబాబు 2019 నాటికి పోలవరం ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2019 నాటికీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తామని చంద్రబాబు అన్నారు.కాగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే చంద్రబాబు కు ఉన్న అతిపెద్ద అవకాశం పోలవరం ప్రాజెక్ట్ అని విశ్లేషకులు అంటున్నారు. పోలవరం ని పూర్తి చేసి ఎన్నికలకు వెళితే టిడిపి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తద్వారా బాబు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న వాడిగా కూడా నిలిచిపోతాడని అంటున్నారు.

Comments