ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిద్దాం!

chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీ సమావేశాలలో సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సహకరించే రైతులకు న్యాయం చేసేందుకే తాము అత్యుత్తమ పరిష్కారాలను సూచిస్తున్నామని తెలిపారు. అలాగే రాజధాని నిర్మాణానికి ఉపయోగపడే అంశాలను ఎవరు చెప్పినా స్వీకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజకీయాలకు అతీతంగా భవిష్యత్ తరాల భరోశా కోసం అత్యుత్తమ రాజధానిని నిర్మించుకుందామని, ఈ బృహత్ కార్యంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక రాజధాని నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ కనీసం ఒక ఇటుకను విరాళం ఇవ్వాలని, క్యాపిటల్ సిటీ నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉందని అందరూ భావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Comments