ఇక నుంచి ప్రతి నెల తెలంగాణ నేతలతో బాబు క్లాసులు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఏ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయో అందరికి తెలిసిందే. మొన్నటి వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విబేధాలు వివాదాలు చెలరేగితే చాలా రోజుల తరువాత తెలంగాణ లో విభేదాలతో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. టీడీపీ కి బలమైన రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎవరు నడిపిస్తారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులు ఉన్నా కుడా అంతగా రానించడం లేదని టాక్.

అయితే ఎలాగైనా తెలంగాణ లో టీడీపీ కి మళ్లీ గత వైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పనిలో పడి చంద్రబాబు ఎక్కువగా తెలంగాలో ఉన్న పార్టీ గురించి పట్టించుకోలేదు. దీంతో నేతల మధ్య విభేదాలు వచ్చాయి. ఇక నుంచి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చంద్రబాబు ప్రతినెలా తెలంగాణ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అధికార పక్ష నాయకుల లోపాలను గట్టిగా నిలదీసేలా నాయకులకు క్లాసులు తీసుకొనున్నారట బాబు. ప్రస్తుతం ఉన్న నేతల మధ్య విభేదాలు చెలరేగకుండా ఎవరి స్థానంలో వారు ఉండాలని కాస్త గట్టిగానే చెబుతున్నారట. మరి చంద్రబాబు ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Comments