2018 కి చంద్రబాబు పెట్టిన పేరు ఇదే..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. గుంటూరులో రైతుల శిక్షణ శిభిరంలో పాల్గొన్న చంద్రబాబు 2018 ని ప్రకృతి వ్యవసాయ నామ సంవత్సరంగా అభివర్ణించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సేంద్రియ పద్ధతులని అవలంభించాలని బాబు రైతులకు పిలుపునిచ్చారు.

సేంద్రియ వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ భవిష్యత్తు తరాలకు కొత్త పద్ధతులు రూపొందించారని కొనియాడారు. సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే మనం నిర్మించబోతున్న అమరావతి రాజధాని గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆధునిక యుగంలో రాజధానిని నిర్మించుకోవడం అంటే అది మనకు దక్కిన గొప్ప అవకాశం. కొత్త ఏడాది ఆరంభం లోనే అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభిస్తాం అని చంద్రబాబు అన్నారు. కృష్ణ – గోదావరి – పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేని మహా సంగమాన్ని ఆవిష్కరిస్తాం అని చంద్రబాబు రైతులతో జరిగిన సభలో పేర్కొన్నారు.

Comments