ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

పవన్ కళ్యాణ్ లేకుండా.. చంద్రబాబుకి కష్టమే? అందుకే ఎన్టీఆర్!


టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన పొలిటికల్ గేమ్ ని అమల్లో పెడుతున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో అపర చానిక్యుడు అంటే అందరు చంద్రబాబే అంటారు. చంద్రబాబు ఏసే ఎత్తులు, పైఎత్తులకి ఓ వైపు వైసీపీ పార్టీ క్రిందా మీదా పడుతుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీని మరింతగా దెబ్బ తీసేందుకు చంద్రబాబు తన దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలని వాడుతున్నాడు. ఎ మాత్రం అవకాశం దొరికిన వైసీపీని, జగన్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అధికార పార్టీగా ఉన్న చంద్రబాబు, ప్రతిపక్షానికి ఎప్పుడు టార్గెట్ కావాలి. అధికార పార్టీ చేసే అవకతవకలు, అవినీతి, ఇచ్చిన హామీలు నేరవేర్చకపోవడం వంటివి ప్రతిపక్షానికి పెద్ద వరంగా మారాలి. కాని వైసీపీ మాత్రం అందులో ఎ ఒక్క అవకాశాన్ని టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఉపయోగించడం లేదు. దీంతో చంద్రబాబుకి బలం పెరుగుతుంది. ఎ ఒక్క అవకాశం వచ్చిన తిరిగి జగన్ టార్గెట్ చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల వ్యూహాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. అందులో అతనికి పెద్ద బలంగా ఓ వైపు పవన్ కళ్యాణ్, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్. నిజానికి పవన్ కళ్యాణ్ భావజాలానికి, జూనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో దగ్గరగా ఉంటాడు. ఎన్టీఆర్ లో కూడా నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అనేది చాలా మంది మాట. సినిమాల తర్వాత రాజకీయాలని తన మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఏవో కారణాల వలన హరికృష్ణ ఫ్యామిలీని, ఎన్టీఆర్ ని చంద్రబాబు కాస్తా దూరం పెట్టె ప్రయత్నం చేసాడు. అయితే మరల ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం పార్టీ గెలుపు కోసం హరికృష్ణకి రాజ్యసభ పదవి ఇచ్చి. ఎన్టీఆర్ ని తన ఉచ్చులోకి లాగే ప్రయత్నంలో ఉన్నాడనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు దేశానికి దూరంగా ఉన్న ఎప్పటికి తెలుగు దేశం తన సొంత పార్టీ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్ ని ఓ వైపు తెలుగుదేశంకి సపోర్ట్ చేసేలా ఒప్పించే ప్రయత్నంలో బాబు ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విధానాలతో రానున్న ఎన్నికలకి సిద్ధమ అవుతున్నాడు. ఈ సారి పవన్ బలం రాజకీయాల్లో మరింత పెరుగుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఈ నేపధ్యంలో బీజేపీ పార్టీ కంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని జనసేనకి కాస్తా ప్రాధాన్యత సీట్లు కేటాయించడం ద్వారా మరల పవన్ కళ్యాణ్ మద్దతు తనకే ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీలోకి వెళ్ళిన తిరిగి అతని మద్దతు తెలుగు దేశంకి ఉంటుందని చంద్రబాబు నమ్మకం. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ లేవనెత్తే ప్రతి సమస్యకి ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపిస్తూ. ఓ వైపు అతని బలం పెంచుతూనే మరో వైపు అతని సపోర్ట్ సంపాదించుకుంటున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి చంద్రబాబు రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయి అనేది భవిష్యత్తులో తేలిపోతుంది.

Comments