ప్రచురణ తేదీ : Mon, Jul 17th, 2017

నంద్యాలపై చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా? అందుకే తతంగం అంతా?

నంద్యాల ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది చంద్రబాబుకి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకి తగ్గట్లే చంద్రబాబు పద్ధతి కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నడు లేని విధంగా కేవలం నంద్యాల నియోజక వర్గంలో గెలుపు కోసం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నిక ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఇవాళ ఉదయం రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం బాబు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంట పాటు చర్చ జరుగింది. ఈ సమావేశంలో గెలుపుకోసం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇన్‌చార్జ్‌‌లకు సీఎం బాబు దిశా నిర్దేశం చేశారు.! ఇన్‌చార్జ్‌లుగా నిమ్మల రామానాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాద్‌ సహా 12 మంది ఎమ్మెల్యేలు నియమించినట్లు తెలుస్తోంది. ఈ 12మంది ఇన్‌చార్జ్‌లు గురువారం నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వరకు జరిగిన ఎన్నికలను తీసుకుంటే 12మంది ఇన్‌చార్జ్‌‌లను నియమించిన దాఖలాలు చాలా అరుదు.! ఓటమిపై వస్తున్నా సంకేతాల ఆధారంగానే ఇంత మంహి ఎన్ చార్జ్ లని నంద్యాల గెలుపు కోసం చంద్రబాబు వినియోగిస్తున్నారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి చంద్రబాబు ఇంత భారీ స్థాయిలో కసరత్తు చేసి నంద్యాల టికెట్ గెలుచుకుంటాడ? లేక వైసీపీకి అప్పగిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Comments