చంద్రబాబు, జగన్ ఇద్దరికీ ఆ నియోజకవర్గంలోనే పండగ !

ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లు ఈ సారి ఒకే నియోజకవర్గంలో సంక్రాంతి పండగ జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఏడాది తనస్వగ్రామమైన నారా వారి పల్లెలో బంధు మిత్రులతో కలసి సంక్రాంతి పండగ జరుపుకుంటారు. నారా వారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. యాదృచ్చికమే అయినా జగన్ కూడా ఈ సంక్రాంతికి అదే నియోజకవర్గాల్లో బస చేయనున్నాడు.

ప్రతిపక్ష నేత జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రోజున జగన్ చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురంలో బస చేయనున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఒకే నియోజకవర్గంలో సంక్రాంతి జరుపుకోవడం చాలా అరుదు. దీనితో ఇరు పార్టీల కార్యకర్తలతో చంద్రగిరి నియోజకవర్గం సందడిగా మారింది.

Comments