ఈ సారి ఎన్టీఆర్, బాలయ్య పై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమైంది చలపతి రావ్ ..?

ఆ మధ్యన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు హానికరమో ఏమో తెలియదు కానీ పక్కలోకి మాత్రం పనికి వస్తారంటూ సీనియర్ నటుడు చలపతి రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీనిపై పెను దుమారం రేగింది. పలు మహిళా సంఘాల నుంచి చలపతి రావు విమర్శలను ఎదుర్కొనవసి వచ్చింది. ఆ ఘటనని మరిచిపోక ముందే చలపతి రావు మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యలను టార్గెట్ గా చేసుకున్నారు.

పెద్ద ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆయనకు ఎవ్వరూ సాటి రాలేరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కాదు ఇంకెవరు వచ్చినా పెద్ద ఎన్టీఆర్ కు పది కిలోమీటర్ల దూరం లోనే నిలిచిపోతారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. చిన్నప్పటినుంచి డాన్సులు బాగా నేర్చుకున్నాడు. కానీ మనిషి మాత్రం మరీ జానెడు అయిపోయాడని అన్నారు. రావణాసురుడు వంటి పెద్ద వేషాలను వేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫిట్ కాలేడని వ్యాఖ్యానించారు. గుండమ్మ కథ, రాముడు భీముడు వంటి కళా ఖండాలను ఎవరు రీమేక్ చేసినా బాగోదని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఎవరు సరిపోరని వ్యాఖ్యానించారు. పెద్ద ఎన్టీఆర్ కు వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలు ఎవరూ ఆయన నటనకు వారసులు కాదని అన్నారు. ఎన్టీఆర్ నటన ఆయనతోనే ఎండ్ అయిందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్ వ్యూ లో చలపతి రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తరచుగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు.

Comments