ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

కేసీఆర్ ఇంటిపై పెళ్లి కుటుంబాల అటాక్ !

ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ పై అటాక్ జరిగింది. కంగారు పడకండి.. ఇందులో కంగారు పడాల్సిందేమి లేదు. అంతా మంచే జరిగింది. ముఖ్యమంత్రిని తమ పిల్లల పిల్లలకు ఆహ్వానించడానికి బుధవారం ముగ్గురు ప్రముఖల కుటుంబాలు వెళ్లాయి. ఏపీ మంత్రి పరిటాల సునీత తన కుమారులిద్దరితో కలసి వెళ్లి కేసీఆర్ ని శ్రీరామ్ పెళ్ళికి రావలసిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ దంపతులిద్దరిని ఆమె సాదరంగా ఆహ్వానించడం విశేషం.

అలాగే మరో ప్రముఖ వ్యక్తి, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూడా కేసీఆర్ ని కలసి తన కుమార్తె పెళ్ళికి ఆహ్వానించారు. నరేంద్ర చౌదరి తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మరో ప్రముఖ వ్యక్తి డా. రంజిత్ రెడ్డి కూడా కేసీఆర్ ని కలసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. ఇలా వరుసగా పెళ్లి కుటుంబాలు కేసీఆర్ కోసం క్యూ కట్టడంతో బుధవారం ప్రగతి భవన్ సందడిగా మారింది.

Comments